సజ్జ సజ్జ ఆఫ్రికా , భారత ఉపఖండాల్లో అతి విస్తారంగా పురాతన కాలం నుండి పండించబడుతుంది - Teluguheal
సజ్జ సజ్జ ఆఫ్రికా , భారత ఉపఖండాల్లో అతి విస్తారంగా పురాతన కాలం నుండి పండించబడుతుంది . ఇది ప్రపంచంలో వేడి వాతావరణంలో సాగుచేయబడే దృఢమైన ఆహార పంట . ఈ పంట అతి వేడి వాతావరణంలో , అతి సారహీనమైన భూముల్లో పండించబడుతుంది . ఉపయోగాలు : సజ్జలు వగరు , తీపి రుచులు కలిగి ఉంటాయి .

 • సజ్జలలో పిండి పదార్థం అధికం . వీటిలో ప్రోటీన్లు , పీచుపదార్థం అధికంగా ఉంటాయి . సజ్జలలో వుండే అమినోయాసిడ్లు గోధుమలో ఉండే అమినోయాసిడ్ల కంటే తేలికగా జీర్ణమవుతాయి . • మిథియోనైన్ , బికాంప్లెక్స్ విటమిన్లు ( నియాసిన్ , థయామిన్ , రైబోఫ్లేవిన్ ) , ఫోలిక్ యాసిడ్ , లెసిథిన్ , పొటాషియం , మాంగనీస్ , జింక్ వంటి అవసరమైన పోషకాలుండటం వలన సజ్జలు అనేక పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తాయి . నియాసిన్ శరీరంలోని కొలెస్టరాల్ని తగ్గిస్తుంది . మంచి హృదయ ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం . ఎందుకంటే ఇది రక్తపోటును తగ్గించి గుండె నొప్పి రాకుండా కాపాడుతుంది . • సజ్జలలో అధికంగా వుండే భాస్వరం శరీర కణ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది . జెనిటిక్ కోడ్ నిర్మాణంలో ముఖ్యమైన న్యూక్లిక్ యాసిడ్లో భాస్వరం ముఖ్యభాగం . కణాల పొరలు , నరాల నిర్మాణంలో పాత్ర పోషించే లిపిడ్లో కూడా భాస్వరం ఒక భాగం . • సజ్జలతో తయారు చేసిన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటే స్త్రీలకు మూత్ర పిండాలలో ఏర్పడే రాళ్ళ సమస్య ఉండదు . శరీరంలో టైగ్లిసరైడ్ల స్థాయిని కూడా తగ్గిస్తుంది . • ప్రతిరోజు సజ ఆహారాన్ని తీసుకోవడం వలన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ , పిల్లలలో ఆస్మా సమస్యలు తగ్గుతాయి . • సజ్జలలో ఉండే అవసరమైన పోషకం లిగ్నిన్ శరీరానికి చాలా ప్రయోజనకారి . అది క్యాన్సర్ , గుండె ఆగిపోవడం వంటి ప్రమాదాలను అరికడుతుంది . • సజ్జల ఆహారం టైప్ 2 డయాబెటిసను కూడా తగ్గిస్తుంది . పండించే ప్రాంతాలు : తెలుగు రాష్ట్రాలలో వరి , గోధుమ , జొన్నతర్వాత సజ్జ ప్రధానమైన ఆహార పంట . జను నల్గొండ , మహబూబ్ నగర్ , నిజామాబాద్ , కర్నూల్ , చిత్తూరు , అనంతపూర్ , ప్రకాశం , విశాఖపట్టణం , విజయనగరం , శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువగా పండిస్తారు . సజ్జ పంటను మెట్ట , తక్కువ వర్షాభావ పరిస్థితుల్లో కూడా పండించవచ్చు . ఇది పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది . -

విత్తే సమయం : ఖరీఫ్ - జూన్ - జూలై , వేసవి - జనవరి నేలలు : తేలిక నుండి మధ్యరకం నేలలు , నీరు ఇంకే , మురుగునీటి పారుదల సౌకర్య గల నేలలు అనుకూలం . విత్తన మోతాదు : ఎకరాకు 1 . 6 కిలోలు విత్తే దూరం : వరుసల మధ్య 45 సెం . మీ . , మొక్కల మధ్య 12 నుండి 15 సెం . మీ . దూరం ఉండేటట్లుగా గొర్రుతో విత్తుకోవాలి . నాటడం : నారు పెంచి , 15 రోజుల వయస్సున్న నారును 45 సెం . మీ . X 12 . 5 - 15 సెం . మీ . దూరంలో నాటాలి . ఎకరానికి 58 , 000 - 72 , 000 మొక్కలు ఉండాలి . ఎరువులు : ఎకరానికి 4 ట . పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి . భూమిలో కర్బన శాతం పెంచడానికి ఎకరానికి 0 . 8ట . వర్మికంపోస్టు వేయాలి . ఇలా , సంవత్సరాలు వర్మికంపోస్టు వేసిన భూములలో ఉదజని సూచిక 4 , 87 నుండి 4 . 92 కి పెరిగింది . ప్రతి ఎకరానికి 100 కిలోల పశువుల ఎరువుతో పాటు 10 నుండి 100 కిలోల ఘనజీవామృతం వేయాలి . • 15 రోజులకొకసారి జీవామృతం పిచికారి చేయాలి . నీటి యాజమాన్యం : మొక్కలకు 30 రోజుల వయసులో ఎకరాకు 2 ట , వేరుశనగ పొట్టు నేల మీద ఆచ్చాదనగా పరిచి భూమిలోని తేమ ఆవిరిగాకుండా కాపాడవచ్చు . అంకురదశ , పూత దశ , గింజ పాలు పోసుకునే దశ , గింజ గట్టి పడే దశల్లో నీటి తడులివ్వాలి . అంతరపంట : సజ్జ + కంది 2 : 1 నిష్పత్తిలో వేసుకోవాలి . కలుపు నివారణ , అంతరకృషి : విత్తిన 2 వారాలలోపు ఒత్తు మొక్కలను తీసి వేయాలి . అంతరకృషి చేయాలి . పంటకోత : సజ్జ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి ముందుగా కొలి కొస్తుంది . కాబట్టి 2 లేక 3 దశల్లో కంకులను కోయాల్సి వస్తుంది . కోసిన కంకులను బాగా ఆరబెట్టి నూర్చా లి .సజ్జ సజ్జ ఆఫ్రికా , భారత ఉపఖండాల్లో అతి విస్తారంగా పురాతన కాలం నుండి పండించబడుతుంది

సజ్జ సజ్జ ఆఫ్రికా , భారత ఉపఖండాల్లో అతి విస్తారంగా పురాతన కాలం నుండి పండించబడుతుంది . ఇది ప్రపంచంలో వేడి వాతావరణంలో సాగుచేయబడే దృఢమైన ఆహార పంట . ఈ పంట అతి వేడి వాతావరణంలో , అతి సారహీనమైన భూముల్లో పండించబడుతుంది . ఉపయోగాలు : సజ్జలు వగరు , తీపి రుచులు కలిగి ఉంటాయి .

 • సజ్జలలో పిండి పదార్థం అధికం . వీటిలో ప్రోటీన్లు , పీచుపదార్థం అధికంగా ఉంటాయి . సజ్జలలో వుండే అమినోయాసిడ్లు గోధుమలో ఉండే అమినోయాసిడ్ల కంటే తేలికగా జీర్ణమవుతాయి . • మిథియోనైన్ , బికాంప్లెక్స్ విటమిన్లు ( నియాసిన్ , థయామిన్ , రైబోఫ్లేవిన్ ) , ఫోలిక్ యాసిడ్ , లెసిథిన్ , పొటాషియం , మాంగనీస్ , జింక్ వంటి అవసరమైన పోషకాలుండటం వలన సజ్జలు అనేక పాత్రలను సమర్థవంతంగా నిర్వహిస్తాయి . నియాసిన్ శరీరంలోని కొలెస్టరాల్ని తగ్గిస్తుంది . మంచి హృదయ ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం . ఎందుకంటే ఇది రక్తపోటును తగ్గించి గుండె నొప్పి రాకుండా కాపాడుతుంది . • సజ్జలలో అధికంగా వుండే భాస్వరం శరీర కణ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది . జెనిటిక్ కోడ్ నిర్మాణంలో ముఖ్యమైన న్యూక్లిక్ యాసిడ్లో భాస్వరం ముఖ్యభాగం . కణాల పొరలు , నరాల నిర్మాణంలో పాత్ర పోషించే లిపిడ్లో కూడా భాస్వరం ఒక భాగం . • సజ్జలతో తయారు చేసిన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకుంటే స్త్రీలకు మూత్ర పిండాలలో ఏర్పడే రాళ్ళ సమస్య ఉండదు . శరీరంలో టైగ్లిసరైడ్ల స్థాయిని కూడా తగ్గిస్తుంది . • ప్రతిరోజు సజ ఆహారాన్ని తీసుకోవడం వలన స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ , పిల్లలలో ఆస్మా సమస్యలు తగ్గుతాయి . • సజ్జలలో ఉండే అవసరమైన పోషకం లిగ్నిన్ శరీరానికి చాలా ప్రయోజనకారి . అది క్యాన్సర్ , గుండె ఆగిపోవడం వంటి ప్రమాదాలను అరికడుతుంది . • సజ్జల ఆహారం టైప్ 2 డయాబెటిసను కూడా తగ్గిస్తుంది . పండించే ప్రాంతాలు : తెలుగు రాష్ట్రాలలో వరి , గోధుమ , జొన్నతర్వాత సజ్జ ప్రధానమైన ఆహార పంట . జను నల్గొండ , మహబూబ్ నగర్ , నిజామాబాద్ , కర్నూల్ , చిత్తూరు , అనంతపూర్ , ప్రకాశం , విశాఖపట్టణం , విజయనగరం , శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువగా పండిస్తారు . సజ్జ పంటను మెట్ట , తక్కువ వర్షాభావ పరిస్థితుల్లో కూడా పండించవచ్చు . ఇది పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది . -

విత్తే సమయం : ఖరీఫ్ - జూన్ - జూలై , వేసవి - జనవరి నేలలు : తేలిక నుండి మధ్యరకం నేలలు , నీరు ఇంకే , మురుగునీటి పారుదల సౌకర్య గల నేలలు అనుకూలం . విత్తన మోతాదు : ఎకరాకు 1 . 6 కిలోలు విత్తే దూరం : వరుసల మధ్య 45 సెం . మీ . , మొక్కల మధ్య 12 నుండి 15 సెం . మీ . దూరం ఉండేటట్లుగా గొర్రుతో విత్తుకోవాలి . నాటడం : నారు పెంచి , 15 రోజుల వయస్సున్న నారును 45 సెం . మీ . X 12 . 5 - 15 సెం . మీ . దూరంలో నాటాలి . ఎకరానికి 58 , 000 - 72 , 000 మొక్కలు ఉండాలి . ఎరువులు : ఎకరానికి 4 ట . పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి . భూమిలో కర్బన శాతం పెంచడానికి ఎకరానికి 0 . 8ట . వర్మికంపోస్టు వేయాలి . ఇలా , సంవత్సరాలు వర్మికంపోస్టు వేసిన భూములలో ఉదజని సూచిక 4 , 87 నుండి 4 . 92 కి పెరిగింది . ప్రతి ఎకరానికి 100 కిలోల పశువుల ఎరువుతో పాటు 10 నుండి 100 కిలోల ఘనజీవామృతం వేయాలి . • 15 రోజులకొకసారి జీవామృతం పిచికారి చేయాలి . నీటి యాజమాన్యం : మొక్కలకు 30 రోజుల వయసులో ఎకరాకు 2 ట , వేరుశనగ పొట్టు నేల మీద ఆచ్చాదనగా పరిచి భూమిలోని తేమ ఆవిరిగాకుండా కాపాడవచ్చు . అంకురదశ , పూత దశ , గింజ పాలు పోసుకునే దశ , గింజ గట్టి పడే దశల్లో నీటి తడులివ్వాలి . అంతరపంట : సజ్జ + కంది 2 : 1 నిష్పత్తిలో వేసుకోవాలి . కలుపు నివారణ , అంతరకృషి : విత్తిన 2 వారాలలోపు ఒత్తు మొక్కలను తీసి వేయాలి . అంతరకృషి చేయాలి . పంటకోత : సజ్జ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి ముందుగా కొలి కొస్తుంది . కాబట్టి 2 లేక 3 దశల్లో కంకులను కోయాల్సి వస్తుంది . కోసిన కంకులను బాగా ఆరబెట్టి నూర్చా లి .Load Comments

Subscribe Our Newsletter

Notifications

Disqus Logo