అరటికాయ బజ్జి
కావలసిన పదార్థాలు
జొన్నపిండి 200 గ్ అరటికాయ 100 గ్రా . శనగపిండి 100 గ్రా . వాము 10 గ్రా . నూనె 300 మి . లీ . ఉప్పు రుచికి సరిపడా నీళ్ళు 200మి . లీ .
తయారీ విధానము
* అరటికాయ పెచ్చు తీసి , చక్రాలుగా తరిగి ఉప్పునీళ్ళల్లో వేయాలి .
* జొన్న పిండి , శనగపిండిలో ఉప్పు , వాము తగినంత నీళ్ళతో గరిట జారుగా ఉంచుకోవాలి .
* బాణలిలో నూనె కాగిన తరువాత అరటి ముక్కలు ఒక్కొక్కటి పిండిలో ముంచి నూనెలో వేయించాలి
. పోషక విలువలు
100 గ్రా . ల ఈ పదార్థములో ప్రోటీన్స్ 5 . 7 గ్రా . , కొవ్వు 43 . 8 గ్రా . పీచుపదార్థము 1 . 3 గ్రా . , పిండి పదార్థము 31 . 3 గ్రా . , శక్తి 543 . 42 కి . కాలరీస్ కాల్షియం 58 . 38 మి . గ్రా . మరియు ఇనుము 2 . 8 మి . గ్రా .