సిరి ' ఆరోగ్య ముచ్చట్లు సిరిధాన్యాలు కొర్రలు ( Fixtail Millet ) , అందుకొరలు ( Browntop Millet ) , సామలు ( Little Millet ) , ఊదలు ( Barnyard Millet ) , అరికలు ( Kodo Millet ) ప్రకృతి ప్రసాదించిన వరాలు ఇవి . ఔషధ గుణాలు సమ్మిళితమైన తిండిగింజలు . అంతేకాదు ఆరోగ్యగుళికలు .
వీటిని తింటూ 6 నెలల నుంచి 2 సంవత్సరాలలో ఎవరైనా వారి వ్యాధులను నిర్మూలించుకోవచ్చు .
సిరిధాన్యాలు పోషకాలను అందించటమే కాకుండా , రోగ కారకాలను శరీరం నుంచి తొలగించి , దేహాన్ని శుద్ధి చేస్తాయి . మనిషికి ఆరోగ్యం అందిస్తాయి .
వీటిని తింటూ 6 నెలల నుంచి 2 సంవత్సరాలలో ఎవరైనా వారి వ్యాధులను నిర్మూలించుకోవచ్చు .
సిరిధాన్యాలు పోషకాలను అందించటమే కాకుండా , రోగ కారకాలను శరీరం నుంచి తొలగించి , దేహాన్ని శుద్ధి చేస్తాయి . మనిషికి ఆరోగ్యం అందిస్తాయి .
ఏ సిరిధాన్యం ఏ యే వ్యాధులను తగ్గిస్తుంది ?
1.కొర్రలు : నల శక్తి , మానసిక దృఢత్వం , ఆరయిటిస్ , పార్కిన్సన్ , మూర్చరోగాల నుంచి విముక్తి
2.అరికలు : రక్తశుద్ధి , రక్తహీనత , రోగనిరోధక శక్తి , డయాబిటిస్ , మలబద్దకం , మంచినిద్ర .
3.ఊదలు : లివరు , కిడ్నీ , నిర్ణాల గ్రంథులు ( ఎండోక్రెయిన్ గ్లాండ్స్ ) , కొలెస్టరాల్ తగ్గించడం , కామెర్లు
4 . సామలు : అండాశయం , వీర్యకణ సమస్యలు , పిసిఓడి , సంతానలేమి సమస్యల నివార
5 .అండుకొర్రలు : జీర్ణాశయం , ఆరయిటిస్ , బి . పి . , థైరాయిడ్ , కంటి సమస్యలు , ఊబకాయ నివారణ .
సిరిధాన్యాలే ఆరోగ్య సిరులు;

ఈ పదార్థాలన్నింటికి విలువ లేకుండా చేయబడింది . ఇది చాలా కంపెనీల చర్యల వల్ల ఇలా జరిగింది . ఇలా మన వ్యవసాయం రూపురేఖలు మారిపోయాయి . మన దేశంలో మనం పిండించే పంటలు తినడం లేదు .
ముందు వ్యవసాయంలో రైతుల చేతిలోనే విత్తనాలు , ఎరువులు తయారయ్యేవి . క్రమంగా ఇది పూర్తిగా మారిపోయింది . ఇలా ఆరోగ్య విషయంలో అలానే వ్యవసాయంలో కూడా దెబ్బతిన్నాం .
. కాబట్టి ఇప్పుడు మన పంటలు , అలాగే చిరుధాన్యాల ప్రాధాన్యత అందరికి తెలియజేస్తే మన పేద రైతులు పండించే ఈ చిరుధాన్య పంటలకు కూడా మంచి విలువ వస్తుంది . వరి అన్నానికి మనం అలవాటు పడ్డాం కానీ , కొర్రలు అన్నమే , ఊదలు అన్నమే , కాని మనం చేసుకోం .
మన పిల్లలకి ముందు తరాలకు చెప్పాల్సిందేంటంటే వరి లాగానే కొర్రలు , ఊదలు , అరికెలు లాంటి చిరుధాన్యాలతో కూడా అన్నం వండుకుని తినొచ్చు .
ఇంకా ఈ చిరుధాన్యాలతో చేసిన అన్నం తింటే ఆరోగ్యం వస్తుంది . వరి అన్నం తింటే అనారోగ్యం రావచ్చు అని చెప్పాలి .